జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ సేవలు అభినందనీయం

జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ సేవలు అభినందనీయం

ఆర్టీఐ సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు

విజయవాడ, నవంబర్ 18:

జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం (RTI Act–2005) పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆర్టీఐ సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు పేర్కొన్నారు.

ఈ నెల 24న నిర్వహించనున్న అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. సీతారామరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి నోరి నాగ పల్లవి, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్. మల్లీశ్వరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి. అనిత కమిషనర్‌ను కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కమిషనర్ పి.ఎస్. నాయుడుకు పుష్పగుచ్ఛం అందించి వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానం పలికారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడికి సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ నెల 24న జరిగే 6వ వార్షికోత్సవ వేడుకల్లో తాను కూడా తప్పనిసరిగా పాల్గొంటానని వెల్లడించారు.


– 9NEWS TELUGU

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి