ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి కమిటీ సభ్యులకు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి నోరి నాగ పల్లవి అభినందనలు

# జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు

**ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి కమిటీ సభ్యులకు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి నోరి నాగ పల్లవి అభినందనలు**

**నవంబర్ 16, విజయవాడ:**

జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి కమిటీ సభ్యులకు ఆ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నోరి నాగ పల్లవి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫౌండర్ డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ నేతృత్వంలో గత ఆరు సంవత్సరాలుగా సంఘం ప్రజలకు సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

సంఘంలో సుమారు 50 శాతానికి పైగా మహిళలు సభ్యులుగా ఉండటం విశేషమని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని కమిటీ సభ్యులు క్రమశిక్షణతో, ఐకమత్యంతో, సమిష్టి బాధ్యతతో పనిచేస్తూ సంఘం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 24న విజయవాడలో శ్రీమతి నోరి నాగ పల్లవి ఆధ్వర్యంలో జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి