గాదెల వలస సర్పంచ్ గా భోగి శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక
గ్రామాభివృద్ధి కోసం ఏక గ్రీవానికి ముందుకొచ్చిన గ్రామస్తులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందనలు
పార్వతీపురం, నవంబర్ 18: సీతానగరం మండలం గాదెల వలస గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా భోగి శంకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక నజరానా ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గాదె లవలస గ్రామస్తులు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ భోగి శంకరరావును ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవానికి ముందుకొచ్చిన గ్రామస్తులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందనలు
పార్వతీపురం, నవంబర్ 18: సీతానగరం మండలం గాదెలవలస గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా భోగిశంకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక నజరానా ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గాదెలవలస గ్రామస్తులు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.