విజయవాడ, నవంబర్ 25:
సుదీర్ఘకాలంగా మహిళల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ చేస్తున్న సేవలు, కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.
జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అసోసియేషన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ నేతృత్వంలో ప్రతినిధులు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. మహిళలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. మహిళల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ గౌరవ అధ్యక్షురాలు ఎస్. లక్ష్మి, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్. మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



