పారమ్మతల్లి సన్నిధిలో జిల్లా కలెక్టర్.. అఖండ జ్యోతి వెలిగించి కొండపైనే రాత్రి బస

పారమ్మతల్లి సన్నిధిలో జిల్లా కలెక్టర్.. అఖండ జ్యోతి వెలిగించి కొండపైనే రాత్రి బస!

సాలూరు :

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పారమ్మకొండను సందర్శించారు. కొండపై కొలువైన పారమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో అఖండ జ్యోతిని వెలిగించారు.

కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో పారమ్మకొండ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ సందర్భంగా కొండపై నిర్వహించిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించిన కలెక్టర్ రాత్రి కూడా కొండపైనే బస చేయడం విశేషంగా నిలిచింది.

పారమ్మకొండపై ఆకాశ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి అక్కడే గడిపిన కలెక్టర్, ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించారు. కార్తీక పౌర్ణమి వేళ పారమ్మతల్లి దర్శనం, అఖండ జ్యోతి వెలిగింపు, కొండపై రాత్రి బసతో కలెక్టర్ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.

ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన పారమ్మకొండ విశిష్టత ఈ పర్యటనతో మరోసారి చర్చకు వచ్చింది..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి