స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ
ఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం ఆర్వో ప్లాంట్ ఉన్న ఉపయోగంలో లేని పరిస్థితి అలాగే వారానికి ఒక్కసారైనా అరటి పండు గాని పాలు గాని అలాగే వారానికి రెండు సార్లు చికెన్ పెట్టాల్సి ఉండగా ఒక్కసారి మాత్రమే పెట్టడం జరుగుతుందని అలాగే పాఠశాలలో వంట చేయడానికి వర్కర్స్ లేకపోవడం విద్యార్థులకు సమయానికి భోజనం అందని పరిస్థితి ఉందని అలాగే ఆశ్రమ పాఠశాలలోANM ను వెంటనే భర్తీ చేయాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే మామిడిపల్లి గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారుగా 200 మంది విద్యార్థులు ఉంటే సరిపోయినంత ఎకామిడేషన్ లేకపోవడం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు G.నితిన్ G.సింహాద్రి పాల్గొన్నారు