ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 3వ వార్డు కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాలూరు పట్టణ *3 వార్డు గుమడాం కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు* గారు వైద్యం పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ అధైర్య పడవద్దని,ధైర్యంగా ఉండమని చెప్పారు.తదనంతరం అక్కడ వైద్యులతో మాట్లాడి కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని *రాజన్నదొర* గారు వారిని కోరారు.