పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు యాజి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్వతిపురం శాసనసభ్యులు బోనేల విజయచంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారు తొలిరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భవాని దీక్షలు చేపట్టి పూజలు నిర్వహించారు.