ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గోగాడవలస సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంచి రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సమాచారం మేరకు ఎస్సై యుఎస్ వెంకట సురేష్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు .ఒక కారులో 45 కేజీల గంజాయి మరో కారులో 217 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా కు పాల్పడ్డ వ్యక్తులు తమ కార్లను విడిచిపెట్టి పరారయ్యారని, పట్టుకున్న గంజాయి విలువ 26 లక్షలు గా రెండు కార్లు విలువ 13 లక్షలు గా ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు సుమారు 1100 కేజీల గంజాయి నాలుగు కార్లను పట్టుకోవడం జరిగిందని 12 మంది ముద్దాయిల ను అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు గంజాయి అక్రమ రవాణా దారులు ఒరిస్సా నుంచి ఘాట్ రోడ్ p కొనవలస మీదగా తరలించే వారిని ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే రావడంతో అటు మీదగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా విజయనగరం జిల్లా ఎస్ కోట విజయనగరం రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో 92 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారని జి ఆర్ పి సి ఐ రవికుమార్ తెలిపారు ఎస్ కోట స్టేషన్లో నలుగురు నించి 61 కేజీల గంజాయిని, విజయనగరం స్టేషన్లో ఇద్దరి నుంచి 31 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.







