వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వరనగర్ లో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు పనిచేయట్లేదన్న అధికారులు చోద్యం చూస్తున్నారు.నూతనంగా వెంకటేశ్వరనగర్ లో ఏర్పాటు అయిన డిఎస్పి కార్యాలయం కూడా ఉంది. చీపురుపల్లి – విజయనగరం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వెంకటేశ్వరనగర్ కాలనీ ప్రదాన కూడలి కావడంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి .గత కొన్ని నెలలుగా వీధిలో వున్న కొన్ని లైట్లు వెలిగిన పరిస్థితి లేదు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏదో షాక్ చెప్పి గాలికి వదిలేస్తున్నారు. కాలనీలో ఈ మధ్య కొత్తగా ఏర్పాటు అయిన డిఎస్పి కార్యాలయం ఉన్నప్పటికీ పంచాయతీ అధికారుల స్పందన అంతంత మాత్రమే. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు కోరుతున్నారు.


