సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని మంత్రి పేర్కొన్నారు.
ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు, ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు.






