ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం
మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  ముఖ్య అతిథిగా హాజరు
సాలూరు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు (Children With Special Needs – CWSN) ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం వేడుకల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  హాజరయ్యారు.
“ప్రభుత్వం అన్ని విభాగాల వారికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తమ సామర్థ్యాలను చూపించేందుకు అవసరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిదీ. ఈ పరికరాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, విద్యాభ్యాసంలో మరింత ఆసక్తిని కలిగిస్తాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దృష్టి లోపం, శారీరక వైకల్యం, వాద్య వినికిడి లోపం వంటి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వీలు కలిగే విధంగా తయారు చేసిన ఉపకరణాలు పంపిణీ చేయబడ్డాయి. 
 





 
             
                                         
                                        