గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు

సాలూరు,ఏప్రిల్19: గిరిశిఖర గ్రామ గర్భిణీల వసతి గృహాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పిఎల్.రఘుకుమార్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.విధుల్లో ఉన్న సిబ్బంది,హాజరు నమోదు పరిశీలించారు.ప్రస్తుతం వసతి గృహ కేంద్రంలో ఉన్న గర్భిణీలు, ఏ ఏ ప్రాంతాలనుండి అడ్మిట్ అయ్యారు వివరాలపై ఆరా తీసి వారి ఆరోగ్య స్థితి వివరాలు ఎంసిపి కార్డుల్లో పరిశీలించారు.గర్భిణీలతో మాట్లాడి అక్కడ అందుతున్న సేవలు,పౌష్టికాహారం,మౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు.గర్భిణీలకు ప్రతీ రోజూ ఐరన్,కాల్షియం మాత్రలు వేయించాలన్నారు.త్రాగు నీరు స్వచ్చత పరీక్షలు నిర్వహించాలని అక్కడ సిబ్బందికి,యాజమాన్యానికి సూచించారు.టాయిలెట్ల నిర్వహణ,పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.గర్భిణీల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఏ సమస్య తలెత్తినా వెంటనే పట్టణంలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు.వాహనం పనితీరుపై ఆరా తీసి పరిశీలించారు. డాక్టర్. భాస్కర్ రావు గారు తమ స్వహస్తాలతో వాహనంకి రెండు టైర్లు ఉచితంగా ఇచ్చారు మరియు గర్భిణీలకు పళ్ళు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలన్నారు.

Spread the love