గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో దారుణ హత్య..!
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింత చెట్టు వీధిలో ఈరోజు (ఆదివారం) ఉదయం ఘోర హత్య ఘటన చోటుచేసుకుంది.
ఉదయం 5 గంటల సమయంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్ మస్తాన్ వలి అనే వ్యక్తిపై వైయస్సార్ కాలనీకి చెందిన సిరిందుల అనిల్ కుమార్ అనే యువకుడు కత్తితో దాడి చేసి గోరంగా గా హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే… గతంలో అనిల్ కుమార్, షేక్ వలి కుమార్తెను వేధించాడన్న ఆరోపణలపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం ఏలూరు కోర్టులో విచారణలో ఉంది. రాజీ కోసం అనిల్ తరఫున ప్రయత్నాలు జరిగినప్పటికీ, వలి కుటుంబం ఒప్పుకోకపోవడంతో అనిల్ కోపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని సమాచారం.
పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ఈ ఘటనతో చింత చెట్టు వీధిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది



