సాలూరు పురపాలక సంఘం
గౌ ” కమిషనర్ D.T.V కృష్ణారావు గారు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ L .బాలకృష్ణ గారి పర్యవేక్షణలో పట్టణ పరిధిలో గల 24వ వార్డుకు సంబంధించి డబ్బి వీధి నుండి దండిగాం రోడ్డుకు ఉన్న కాలువలో మట్టి పేరుకుపోవడం స్థానిక ప్రజలు ఇబ్బంది పడటం వలన J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు (కాలువలో ఉన్న మట్టిని ) వెంటనే వాటిని ట్రాక్టర్ ద్వారా తరలించడమైనది. మరియు బోసుమ జంక్షన్ నుండి శివాజీ బొమ్మ జంక్షన్ వరకు శతపతి వీధి ఏరియాలో రోడ్డు ఇరుపక్కల పేరుకుపోయిన మట్టి దెబ్బలను తవ్వించి వాటిని తరలించడమైనది. మరియు శతపతి వీధి ఏరియా లో ఉన్న ఉల్లిపాయలు షాపులు, కిరాణి షాపులు నుండి వచ్చిన చెత్తలు ఆరుబయట పారబోయకుండా మున్సిపల్ వాహనమునకు అందించాలని అక్కడ ఉన్న వ్యాపారస్తులకు శానిట ఇన్స్పెక్టర్ గారు మరియు సిబ్బంది హెచ్చరించడం జరిగింది.








