పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ ఆంజనేయ స్వామికి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్ కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం లోని శివ లింగానికి గ్రామానికీ చెందిన కర్రి వెంకట రమణ, వంశీ కృష్ణలు రూ 1లక్ష విలువ చేసే వెండి నాగ పడగ అందచేశారు.దాతలు పువ్వాడ శ్రీనివాసరావు- రాధ, వెంకట్ -అంబిక, ఫణి కుమార్- సింధు , రఘు- బ్యూల దంపతులు 2వేల మంది భక్తులకు కి అన్న ప్రసాద వితరణ చేశారు.కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రొంపెల్లి వెంకట రమణ,బంకపల్లి వెంకటరమణ, కర్రి వెంకట రమణ, తదితర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.






