ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, ప్రజల మేలు అనే ధ్యేయంతో పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు ఎన్డీయే కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి “ఏడాది పండుగ”ను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ..ఈ ఏడాది ప్రజలతో నడిచి, వారి సమస్యలపై స్పందించి, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి సారధ్యంలో అమలు చేయడం గర్వంగా అనిపిస్తోందని యువనేత రామ మల్లిక్ నాయుడు అన్నారు.
మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ ఎమ్మెల్యే కళావెంకటరావు గారి నాయకత్వంలో తీసుకురావాలని సంకల్పిస్తున్నానని,సుపరిపాలనలో వేసిన తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని. ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అధికారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపుతున్నాని అన్నారు. మలి అడుగు మరింత విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.






