చీపురుపల్లి నియోజకవర్గం కర్లాం గ్రామంలో
తేదీ 17- 6- 2025 మంగళవారం రోజున జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో జనసైనికుడు కీర్తిశేషులు శ్రీ దుగ్గు మురళిగిరి గారి జ్ఞాపకార్థంగా కిమ్స్ మరియు జేమ్స్ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ, APTKSS రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్, కోట్ల కృష్ణ మరియు భారీ ఎత్తున కర్లాం గ్రామ ప్రజలు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన జనసేన గ్రామ యువతను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఇలాంటి మెగా వైద్య శిబిరాలు వలన గ్రామంలో రోజు వారి వారి పనుల్లో పడి ఆసుపత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న మహిళలకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించిన ఆసుపత్రి యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను.










