ఘనంగా కేసలి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1

ఘనంగా కేసలి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలంలోని కేసలి గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గ ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ వారి సమస్యలను, అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల నుంచి వచ్చిన ప్రజాభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా గమనించిన మంత్రివర్యులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దాకా వేగంగా మరియు పారదర్శకంగా తీసుకువచ్చే దిశగా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.


“ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి అన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాం. ప్రతి కుటుంబాన్ని సాధికారత వైపు నడిపించడమే మా లక్ష్యం.”
కేసలి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల మధ్యలో పాదయాత్ర నిర్వహించారు. గ్రామస్థులు మంత్రి గారిని పూల దండలతో, పసుపు కుంకుమలతో, మేళతాళాలతో ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో ఒక కొత్త ఆశా సంచలనం నెలకొనడంతో, సమగ్ర అభివృద్ధి సాధనకు ఈ కార్యక్రమం నాంది పలికిందని నేతలు అభిప్రాయపడ్డారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి