సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి
హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందించడంలో ఈ హాస్పిటల్ కీలక పాత్ర పోషించనుందని, కాబట్టి నాణ్యత, సదుపాయాలు, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
తదుపరి, మున్సిపల్ అధికారులు మరియు మండల రెవెన్యూ అధికారులతో మంత్రి సమావేశమై, హాస్పిటల్ పరిసరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, డ్రైనేజ్ సౌకర్యాలు, నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ల వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు అందించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.







