ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన g.అగ్రహారం ఆకుల స్వామినాయుడు తల్లి గారు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి ప్రచార విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు ఆయా కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం కల్పించారు, చీపురుపల్లి పట్టణం, జి. అగ్రహారం,కొత్త కుమ్మరి కాలనీ, శివరాం రోడ్డు లో ఇటీవల పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎవరికి ఏకష్టం వచ్చినా రాత్రనక పగలనక తేడా లేకుండా వైస్సార్ పార్టీ నాయకులకు ఒక ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీ దగ్గర ఉండి మీ కష్టాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కుటుంబాలను పరామర్శించి ఏమి అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కుటుంబానలకి భరోసా ఇచ్చారు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడుతో పాటు మీసాల వరహాలనాయుడు, మంగళగిరి సుధారాణి శ్రీనివాసరావు, గవిడి సురేష్ ,కర్రోతు ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ దాలయ్య, వార్డ్ మెంబెర్స్ రౌతు పైడిరాజు, ప్రభాత్ కుమార్, యూత్ నాయకులు పతివాడ అఖిల్, పిల్ల అప్పలరాజు, రెడ్డి సురేష్, బాల, చిరంజీవి, రాజు, వెంకీ,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.




