*చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ,జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు గారు హాజరైన జనసేన నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు* చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయలో గౌ .*శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు* సమక్షంలో *13వ ఆవిర్భావ దినోత్సవ వేడుక *జనసేన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు* అనంతరం విసినిగిరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం 13 సం” కావస్తున్న సందర్భంగా గౌరవనీయులైన *శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి* ఆశయ సాధనలో మేమంతా జనసేన పార్టీలో చేరి వారితో పాటు ముందడుగు వేయడం, ఆదర్శనీయమని వారి అడుగుజాడల్లో నిరంతరం పయనిస్తూ పార్టీ బలోపేతానికి ప్రజాసేవలో మరింత ముందుకు సాగడానికి జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు అలుపెరగని కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజున 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాడేరు లో గిరిపుత్రుల సమక్షంలో జెండా ఆవిష్కరణ నిర్వహించీ, గిరిజనులకు అండగా గ్రామ గ్రామాన ప్రతి గిరిజన తాండా కు రోడ్లు వేయిస్తూ, కాలువలు నిర్మిస్తూ, విద్యుత్ అందిస్తూ ,మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ, ఆయన చేసిన కృషి ప్రతి గిరిజన తండాలో వెలుగులు నింపుతుందని , గిరి పుత్రుల ముఖంలో చిరునవ్వులు చూస్తు వారికి అండగా ఒక అల్లూరి సీతారామరాజులా వారి సంక్షేమమే అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో పనిచేయడం ప్రతి జనసేన నాయకుడికి జన సైనికుడికి వీర మహిళలకు అరుదైన గౌరవంగా భావిస్తూ, నిరంతరం మా ప్రయాణం ఆయనతో, ఆయన వెంటే ఉంటూ, ఆయన కోసమే పని చేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరు రమేష్ రాజుగారు, సిగ మహవదేవనాయుడు , చందక బాలకృష్ణ, బాకూరు శ్రీనివాసరావు, వాసు ,గొర్లె చిన్నమనాయుడు, గొర్లే ఆదినారాయణ ముళ్ళు జగదీష్, మీసాల సూరినాయుడు, రెల్లి పైడిరాజు , లక్ష్మణరావు, కె కృష్ణ, జనసేన శంకర్ , వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం