1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ, ఆర్.వి.ఆర్.కే.చౌదరి గారి ముఖ్యమైన విజ్ఞప్తి.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అక్రమంగా మందుగుండు సామాను (Explosives) తయారీ, నిల్వ (Storage), మరియు వినియోగం చేయుట పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేయడమైనది. ఇటువంటి చర్యలు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగించే ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నది. అందువలన, మీ పరిసరాలలో ఎక్కడైనా ఎవరైనా  ఉంచుతున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే విజయనగరంL

1 పట్టణ పోలీస్ స్టేషన్‌నుకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

*సమాచారం ఇవ్వవలసిన  ఫోన్ నెంబర్: 9121109419*

అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను కాపాడుట మన అందరి బాధ్యత కావున, ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పోలీసులకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

*//స్టేషన్ హౌస్ ఆఫీసర్//*
*//విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్//*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి