పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి . అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న మంత్రి. భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ నాయకుడు, సామాజిక సంస్కర్త, న్యాయవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మంత్రి పేర్కొన్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ (Mhow) ప్రాంతంలో 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారు జన్మించారని మంత్రి తెలిపారు. కుల వివక్ష, అస్పృశ్యత, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ గారని అన్నారు.ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆశయంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని మంత్రి పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు hoఅమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. “సమాజంలో సమానత్వం – ప్రజలలో ఐక్యత అనే అంబేద్కర్ భావజాలాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అనే ఎన్టీఆర్ గారి ప్రబోధం అంబేద్కర్ స్ఫూర్తి నుంచే వచ్చిందని మంత్రి తెలిపారు. ⁠నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే అంబేద్కర్ కు భారత రత్న అవార్డు ప్రకటించారు పార్లమెంట్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.న్యాయవాదిగా పనిచేస్తూ దళితుల హక్కుల కోసం అంబేద్కర్ గారు నిరంతరం పోరాటం చేశారని మంత్రి గుర్తుచేశారు.అస్పృశ్యత నిర్మూలన కోసం అనేక ఉద్యమాలు నడిపిన మహనీయుడు అంబేద్కర్ గారని అన్నారు.1927లో అస్పృశ్యులకు నీటి హక్కు కోసం మహాడ్ సత్యాగ్రహం నిర్వహించారని తెలిపారు.1947లో స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారు బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని మంత్రి తెలిపారు. 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించి సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు . 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు మహాపరినిర్వాణం పొందారని పేర్కొన్నారు.1990లో భారత ప్రభుత్వం అంబేద్కర్ గారికి దేశ అత్యున్నత పురస్కారం “భారత రత్న” ప్రదానం చేసిందని మంత్రి తెలిపారు
అంబేద్కర్ గారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని మంత్రి పిలుపునిచ్చారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి