డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర గారి నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.దళితులు, మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు,భారత రాజ్యాంగం నిర్మాత,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం వైసిపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ