రిపోర్టర్సునీత రెడ్డి విజయనగరం
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు నిర్వహించబడుతున్న మాదక ద్రవ్య విముక్తి కేంద్రం (Drug De-Addiction Centre) లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పద్మజ తెలిపారు.
ఈ నియామకాలలో భాగంగా వైద్యుడు (పూర్తి సమయం) – 1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ – 1, కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ – 1, పీర్ ఎడ్యుకేటర్ – 1, వార్డ్ బాయ్ – 1, యోగా థెరపిస్ట్ / నృత్య / సంగీత / కళా ఉపాధ్యాయుడు – 1, చౌకీదార్ – 2, హౌస్ కీపింగ్ సిబ్బంది – 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీ 30.05.2026 సాయంత్రం 5.00 గంటలలోపు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయంలో నేరుగా సమర్పించవలసిందిగా సూచించారు.
దరఖాస్తు నమూనా మరియు పూర్తి నోటిఫికేషన్ వివరాల కొరకు vizianagaram.ap.gov.in⁠ ను సందర్శించవచ్చని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి