ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి దూరంగా ఉండి వారి కుటుంబాలను కాపాడుకొని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణంలో గల 25వ వార్డు లో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ మహిళలతో భారీ ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా కాలేజీల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ చదువు పైన దృష్టి పెట్టకుండా డ్రగ్స్‌కు బానిసై వారి యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో స్త్రీ తన పిల్లల్ని తన భర్తని తన అన్నదమ్ముల్ని గమనిస్తూ వాళ్లు గనక తప్పుదోవ పట్టి డ్రగ్స్ కు అలవాటు పడినట్లయితే వారికి వారి కుటుంబమే మంచి కౌన్సిలింగ్ ఇచ్చి తీర్చి దిద్దుకోవాలన్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పమని ఇంకా వెనకపోతే పోలీసు వారి సహాయం కూడా తీసుకొని యువతిని స్టూడెంట్స్ ని డ్రగ్స్ బారి నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. అంతేకాకుండా ఎక్కడన్నా వీధుల్లో గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మినట్లయితే పోలీసు వారికి వెంటనే తెలియజేయాలని మహిళలని కోరారు. మహిళలు తమ వంతు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించినట్లయితే డ్రగ్స్ బారి నుంచి యువతను విద్యార్థులను కాపాడవచ్చని హితవు పలికారు. అంతేకాకుండా వీధుల్లో సారా కూడా అమ్మటం చూసిన పోలీసు వారికి తెలియజేయమని చెప్పారు అంతేకాకుండా డ్రగ్స్ యువత తీసుకునేటప్పుడు మోతాదు కొంచెం ఎక్కువైనా వారి యొక్క బ్లడ్ క్లాట్ గుండెకు సరఫరా తగ్గి మరణాలు కూడా చెందుతారని ఆ విషయాన్ని ఎవరైనా డ్రగ్స్ బాధితులు ఉంటే వారికి తెలియజేయమని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముగడ గంగమ్మ 25 వ వార్డు మహిళలు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ మాదక ద్రవ్య విముక్తి కేంద్రంలో వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం