PTR NAIDU చీపురుపల్లి

నల్ల బ్యాడ్జీలతో కెమిస్టుల నిరసన ప్రదర్శన

గరివిడి–చీపురుపల్లి పట్టణాల్లో మెడికల్ షాపులు బంద్

గరివిడి, మే 20: అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపుమేరకు గరివిడి–చీపురుపల్లి పట్టణాల్లోని కెమిస్టులు బుధవారం ఒకరోజు మెడికల్ షాప్ బంద్ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని మెడికల్ దుకాణాలను మూసివేసిన ఫార్మసీ యజమానులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రిస్క్రిప్షన్‌లను సరిచూడకుండా ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు జరగడం, భారీ డిస్కౌంట్లతో స్థానిక మెడికల్ షాపులకు నష్టం కలిగించడం, ఏఐ ద్వారా సృష్టించబడిన నకిలీ ప్రిస్క్రిప్షన్‌లు, పోస్టు వైద్యుల పేరిట నకిలీ ఆన్‌లైన్ సంప్రదింపులు, ఒకే ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు ఉపయోగించడం, నియంత్రిత మరియు సున్నితమైన ఔషధాల అక్రమ విక్రయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విధానాలు ఫార్మసీ రంగ అభివృద్ధికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం గరివిడి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి