రిపోర్టర్…సునీత రెడ్డి విజయనగరం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు నిర్వహించబడుతున్న మాదక ద్రవ్య విముక్తి కేంద్రం (Drug De-Addiction Centre) లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పద్మజ తెలిపారు.ఈ నియామకాలలో భాగంగా వైద్యుడు (పూర్తి సమయం) – 1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ – 1, కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ – 1, పీర్ ఎడ్యుకేటర్ – 1, వార్డ్ బాయ్ – 1, యోగా థెరపిస్ట్ / నృత్య / సంగీత / కళా ఉపాధ్యాయుడు – 1, చౌకీదార్ – 2, హౌస్ కీపింగ్ సిబ్బంది – 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీ 30.05.2026 సాయంత్రం 5.00 గంటలలోపు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయంలో నేరుగా సమర్పించవలసిందిగా సూచించారు.దరఖాస్తు నమూనా మరియు పూర్తి నోటిఫికేషన్ వివరాల కొరకు vizianagaram.ap.gov.in ను సందర్శించవచ్చని తెలిపారు. Spread the love టపా నావిగేషన్ నల్ల బ్యాడ్జీలతో కెమిస్టుల నిరసన ప్రదర్శన