పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కౌంటింగ్ వరకు ప్రజలు సంయమనం పాటించాలి
ఎన్నికల ఫలితాల వరకు ప్రజలు సంయమనం పాటించాలని సిఐ వాసు నాయుడు పట్టణ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఎన్నికలకు సహకరించినట్లే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ఆయన తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ వాసు నాయుడు తెలిపారు