ద్వీపాన్ని తలపించే గ్రామం

ద్వీపాన్ని తలపించే గ్రామం

రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే ఆ గ్రామస్తులు గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉన్నపుడు ధైర్యం చేసి వాగు దాటుతున్న పుడు చాలా మంది వాగులో కొట్టుకు పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆగ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానినికి కూతవేటు దూరంలో ఉన్న పారన్న వలస గ్రామం. ఈ గ్రామ ప్రజల కష్టాలను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గత ప్రభుత్వ హయాంలో పారన్నవలాస నుండి బోరాబంధ రోడ్డుకు మధ్య ప్రవహిస్తున్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు.కానీ ప్రభుత్వ ఖాజానలో నిధులు లేమి కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులు సగం లో నే నిలిచిపోయాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు వాగులు పొంగి పొర్లు తుండడంతో గ్రామస్తులు గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది దీంతో అధికారులు,నాయకులు తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు అందరూ కలిసి అసపూర్ణంగా నిలిచిపోయిన బ్రిడ్జిపై చెక్కలు,కర్రలతో దారి ఏర్పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేస్తూ రాక పోకలు సాగిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి మాకు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి