కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు
తిరువీధి కుంకుమ పూజలు కళ్యాణం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు
పార్వతీపురం మండలం జిల్లా సాలూరు పట్టణం లో కామాక్షి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, దేవీ ఉపాసకులు ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు గణపతి హోమం, కుంకుమ పూజలు, మధ్యాహ్నం తిరువీధి మహోత్సవం. రెండో రోజు శ్రీమతి వాణి గారి నాయకత్వంలో మహిళలచే రుద్ర నమక చమకాది వేద పారాయణం, అనంతరం పాటలు కోలాటం, హారతి రథప్రదక్షిణ జరుగును. మూడోరోజు శుక్రవారం సాయంత్రం కామాక్షి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. 28న మంగళవారం విశేష అన్నప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.