పార్వతీపురం మన్యం జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ సచిన్ రహన్ పరిశీలించారు.
సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సంబంధిత ఏర్పాట్లను, బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సుల భద్రతకు, స్ట్రాంగ్ రూమ్‌ల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులు సూచించినట్లు సమాచారం.
— THE 9 NEWS TELUGU






