సాలూరు పట్టణంలో బంగారం కాలనీ బంగారం పేట చిన్న హరిజన పేటలో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య ఆరోగ్యం పోషణ అనేది ముఖ్యమైన అంశాలని ఆడపిల్లలను చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని అలా కాకుండా బాల్య వివాహాలు చేసి పిల్లల జీవితాలని పాడు చేయవద్దని సూచించారు అంతేకాకుండా ఆడపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మంచి పౌష్టికాహారం అందించి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్లను దూరం చేసే బాధ్యత తల్లిదండ్రులదేనని ఆడపిల్లలను బాగా చదివించి సమాజంలో వాళ్లకు వాళ్లే రక్షణ కల్పించుకునే అంతగా తల్లిదండ్రుల బాధ్యత వహించాలని ఈమె తెలియజేశారు ఇందులో భాగంగా కళా జాతర పెట్టి ప్రజలకు ఆడపిల్లలను చదివించకుండా బాల్యవివాహాలు చేసిన ఏ విధమైన అనర్ధాలు వస్తాయో కళా జాతర ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎస్ భారతి మరియు తిరుపతమ్మ, సంధ్య, ప్రవీణ, గీత, ప్రమీల, లక్ష్మి, పద్మ, పాల్గొన్నారు

