పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు
అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి
ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించే పథకం కింద, ఈ రోజు మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల రూ.7,000 చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.
*సాలూరు నియోజకవర్గంలో 31,294 మంది రైతులకు మొత్తం రూ.21.9 కోట్లు,*
*పార్వతీపురం మన్యం జిల్లాలో 1,22,260 మంది రైతులకు రూ.84.58 కోట్లు అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు.*
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున గారు, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సాలూరు నియోజకవర్గం AMC చైర్మన్ ముఖి సూర్యనారాయణ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.





