రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ


మంగళవారం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని శ్రీ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గేదెల రిషి వర్ధన్ గారు ప్రిన్సిపాల్ లు  దత్తి నాగేశ్వరరావు, హేమంత్ కుమార్ లు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన భక్తులు రిషి విద్యాసంస్థల దాతృత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా రిషి విద్యాసంస్థల కరస్పాండెంట్ రిషి వర్ధన్ గారు మాట్లాడుతూ ఇలాంటి వితరణ కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా జరగడం తమకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఇకమీదట చుట్టుపక్కల జరగబోయే ప్రతి ఉత్సవాలలోనూ తమ సంస్థ ఇంతే ఉత్సాహంగా పాల్గొంటుందని ,వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి