మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు * ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, బంగార్రాజు గారు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని, యువత ధార్మిక విలువలను ఆచరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందిన బంగార్రాజు , నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్యదర్శి గేదెల రాజారావు గారు,పార్లమెంట్ అధికాార ప్రతినిధి తాడి సత్యనారాయణ మరియు తడుతరులు పాల్గొన్నారు.



