క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి

క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి

బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి  పరామర్శించారు.

స్థానికుల వివరాల మేరకు, సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మూడు క్లోరినేషన్ సిలిండర్లు పంపుహౌస్ వద్ద ఉండగా, వాటిలో ఒకటి లీక్ కావడంతో రాగాల రాధ, బొందు సురేష్, బొందు మురళీకుమారి, కామేశ్వరి, బి. లావణ్యలు తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయారు.

వెంటనే వారికి వైద్య సహాయం అందించి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన శ్రీమతి తేజోవతి  బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వైద్య సిబ్బందితో మాట్లాడి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

అలాగే, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యం,భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని,పాత సదుపాయాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి