అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైన
అరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.
గుమ్మ తనూజరాణి

అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైనఅరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.గుమ్మ తనూజరాణి


అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్.దినేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో  ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్. జల్లిపల్లి సుభద్ర
పాడేరు నియోజకవర్గం శాసనసభ్యులు.వైసిపి అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు.
మత్స్యరాస విశ్వేశ్వర రాజు అరుకు నియోజకవర్గం శాసనసభ్యులు.శ్రీ రేగం మత్స్యలింగం .
ఈ సందర్భంగా అరుకు ఎంపీ
గుమ్మ తనూజరాణి గారు. మాట్లాడుతూ:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పధకం కింద మంజూరు చేయబడిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని MGNREGA, PMGSY, విద్యుత్, మత్స్య, వ్యవసాయం, ఉద్యానవన, భూ సంరక్షణ, పాఠశాల విద్య, PWD, తాగునీరు మరియు పారిశుధ్యం, జల వనరులు, ఆరోగ్యం, అటవీ, సాంఘిక సంక్షేమం మరియు సామాజిక విద్య, గ్రామీణాభివృద్ధి మరియు బ్యాంకింగ్ రంగాల అధికారులు సమన్వయంతో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధి సమన్వయం కొరకు పాటుపడాలని ఈ సందర్భంగా తెలుపుతూ చేపడుతున్న అన్ని రంగాల సంబంధిత ప్రాజెక్టులపై వివరణ కోరగా సహా వివిధ విభాగాల అధికారులు వారి సంబంధిత ప్రాజెక్టుల అమలుపై వివరణాత్మక పురోగతి నివేదికలను అరుకు పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) & దిశా కమిటీ చైర్పర్సన్ .గుమ్మ తనూజరాణి కి అందించారు.
ప్రజలకు సకాలంలో ప్రయోజనాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను మన అరుకు ఎంపీ  తన నేటి ప్రసంగంలో నొక్కి చెప్పారు.అధికారుల అలసత్వంతోనే యూరియా కొరత ఏర్పడిందని అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించినప్పుడే పంటల సాగు సక్రమంగా సాగుతోందని అధికారులు రైతుల సమస్యలు గుర్తించి వేగవంతంగా ఎరువులు అందిలాగా చర్యలు తీసుకోవాలని  దిశా కమిటీ చైర్పర్సన్. ఎంపీ గుమ్మ తనూజరాణి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి.
శ్రీ అభిషేక్ గౌడ గారు.మరియు అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధికారులు తదితరులు అనేకమంది సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి