అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి దుర్గారావు అధ్యక్షతన పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీలపై కూటమి ప్రభుత్వ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ, కూటమి ప్రభుత్వ నాయకులతో అర్థరహితమైన ఫిర్యాదులు జిల్లా అధికారులకు అందజేస్తూ ఆరోపణలు చేసి వారిపై దాడులు చేసి వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడి అనుబంధ సంస్థ అయినా ఏఐటియుసి రాష్ట్ర నాయకులతో సమావేశ ఏర్పాటు చేసి మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని వేతనాలు పంపుదల చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కి ఈ చిరు ఉద్యోగులపై చేస్తున్న దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్ మాట్లాడుతూ ఓట్లు కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు గుంజుకున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని చిరు ఉద్యోగుల సమస్యలు కనిపించడం లేదా అని ఆరోపించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి చిరుద్యోగుల సమస్యల పైన, ఉద్యోగ భద్రత పైన దృష్టి సారించి వారి పై దాడులను అరికట్టి, సమాన పనికి సమాన వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.