పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ మరియు ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలికలపై లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు యాసిడ్ దాడులు ఎక్కువ అవుతున్నాయని వాటి నుండి తమని తాము కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు బాలికలు కచ్చితంగా తీసుకోవాలని బాలికలకు సూచించారు అంతేకాకుండా బాలికలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్కూల్ కి కాలేజీలకి వెళ్లేటప్పుడు పోకిరి గాళ్లు మోసపూరితమైన మాటలు చెప్తారని ఆ మాటలకు గనక ఆకర్షణలో బాలికలు పడినట్లయితే తమ జీవితాన్ని కోల్పోతారని ఉన్నత చదువులు కూడా చదవలేక ఇబ్బందులు పడతారని కావున అలాంటి పోకిరిగాలను తమ ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ఇబ్బందులు పడకుండా తమ తల్లిదండ్రులకు గురువులకు తెలియజేయాలని సూచించారు అంతేకాకుండా ఆడపిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలంటే పట్టుదల కృషి ఏకాగ్రత ఎంతో ముఖ్యమని తెలియజేశారు బాలికలు చదువుకునేటప్పుడు కూడా కళాశాలలో వారి యొక్క గురువులు ప్రవర్తన బాగోకపోయినా తల్లిదండ్రులకు పోలీసు వారికి సమాచారం ఇవ్వమని తెలియజేశారు అనంతరం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా పిల్లలకు ప్రాక్టికల్ గా చూపించారు ఏ ఐ ఎస్ ఎఫ్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని హాస్టల్ యాజమాన్యం పిల్లలతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వసతులు సక్రంగా లేకపోయినా తనకు తెలియజేయాలని అంతేకాకుండా బాలికలు అన్ని రంగాల్లో బాగా చదువుకొని ముందంజలో ఉండాలని సూచించారు ఎంతోమంది స్త్రీలు మన దేశంలో రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్నది స్త్రీలే ఎక్కువ శాతం గా ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని బాలికలు బాగా చదువుకొని వారి తల్లిదండ్రులకు ఈ సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో హాస్టల్ మేడం నిర్మల గారు ఏ ఐఎస్ఎఫ్ సాలూరు మండల నాయకులు హరి సునీల్ పాల్గొన్నారు





