మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలో ఉన్న 13 వ వార్డు లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బోను వీధి ఏరియాలో మహిళలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
కావున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ తమ ఇంటి నుండి వచ్చిన వ్యర్ధాలను తప్పకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి అందించాలని ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా సీజనల్ వ్యాధులు బారిన పడకుండా పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు మరియు శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.





