పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 14వ వార్డు బంగారమ్మ కాలనీలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ మరియు ఏపీ శ్రామిక మహిళా ఫారం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి బలగరాధనాయుడు ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీని చేపట్టారు ఈ ర్యాలీ ను ఉద్దేశించి 14వ వార్డు ప్రజలతో రాధా నాయుడు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆడుతూ పాడుతూ సరదాగా తన బాల్య జీవితాన్ని కడుపుతో చదువుకుంటున్న వయసులో వివాహాలు చేసినట్లయితే బాలికల జీవితాలు నాశనం అవుతాయని దానికి కారణం తల్లిదండ్రులు కాకూడదని హితోపలికారు 18 సంవత్సరాలు నిండకుండా బాల్యవవాహాలు చేసినట్లయితే తను ఒక బిడ్డను కనటానికి కూడా బాలిక యొక్క గర్భసంచి సిద్ధపడకపోగా అనారోగ్యమైన బిడ్డకు అనగా బరువు తక్కువ మరియు రక్తహీనతకు గురి గురి అయిన బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి కూడా రక్తహీనతతో బాధపడుతూ అనారోగ్యం పాలవుతారని దానివలన తల్లికి బిడ్డకి కూడా ప్రాణహాని కూడా జరుగుతుందని అంతేకాకుండా తరచూ అనారోగ్యానికి గురవడం వలన ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుందని కావున ఆడపిల్లను చదివించే స్తోమత ఒకవేళ ఎవరికైనా లేకపోయినా ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో హాస్టల్స్ కాలేజీలు కట్టించి ఉన్నారని అందులో సంతోషంగా ఆడపిల్లలు నీ చదివించవచ్చని దానికి పూర్తి సహకారం తల్లిదండ్రుల అందించాలని కోరారు అంతేకాకుండా ఆడపిల్లలు చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకున్నట్లయితే ఆర్థికంగా సామాజికంగా గౌరవంగా ఎదుగుతారని అది చూసి తల్లిదండ్రులకు కూడా ఆనందంగా ఉంటుందని తెలియజేస్తూ ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేయకుండా కచ్చితంగా చదివించినట్లయితే మెరుగైన సమాజాన్ని మనం చూడవచ్చని తెలుపుతూ వారికి ఇచ్చిన రిజర్వేషన్స్ కూడా చదివితే ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని బాగుపరిచే బాటను తల్లిదండ్రులే వేయవచ్చని తెలియజేశారు అనంతరం ఆడపిల్లలను చదివించాలని ఆడపిల్లలను రక్షించాలని బాల్యవివాహాలను చేయరాదని పురోనా హత్యలను కూడా చేయరాదని భారీ నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాసరి అచ్చయ్య మరియు మహిళలు వార్డు సభ్యులు పాల్గొన్నారుపాల్గొన్నారు

