*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డు అఫ్ ఇండియా(SEBI) ట్రైనర్ డాక్టర్ శ్రీను మాడెమ్ వారి ఆధ్వర్యంలో బి.టెక్ విద్యార్థులకు ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ ఎక్సేంజ్ మరియు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ట్రైనర్ డాక్టర్ శ్రీను మాడెమ్ విద్యార్థులకు ప్రైమరీ మార్కెట్,సెకండరీ మార్కెట్,క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ ల గురించి వివరించారు. మరియు పెట్టుబడిదారులకు పెట్టుబడులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అలాగే బాంబే స్టాక్ ఎక్సేంజ్,నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ విధులు,సెబీ గైడ్ లైన్స్ గురించి విద్యార్థులకు తెలియజేశారు.మరియు సేవింగ్స్ అవసరం మరియు ప్రాముఖ్యత,దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి ప్రణాళిక,షేర్లు,బాండ్లు,ఇండెక్స్‌ల అవగాహన కల్పించారు.మరియు స్టాక్ మార్కెట్లో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు.అలాగే ఆన్‌లైన్ మోసాలు,లింక్ ఫ్రాడ్స్,పట్ల జాగ్రత్తలు,సురక్షిత పాస్‌వర్డ్స్,బ్యాంకింగ్ & UPI భద్రత పై అవగాహన కల్పించారు.మోసపూరిత సెల్ ఫోన్ యాప్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్. ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.




