గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం

గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం



స్థానిక పశు వైద్య కళాశాల, గరివిడి నందు ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా రక్తదాన శిబిరం, కళాశాల అసోసియేట్ డీన్ డా. మక్కెన శీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయాల పాలై రక్తం అవసరమైన వ్యక్తులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం కనీస మానవ ధర్మం అని, విద్యార్థులకు రక్తదానంపై ఉన్న అనేక అపోహలను నివృత్తి చేసి, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిన ఆవశ్యకతను గూర్చి అవగాహన కల్పించారు. జాతీయ సేవా పథకంలో భాగంగా ఇటువంటి సేవాభావం కలిగిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు గరివిడి పశువైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులు మరియు సిబ్బంది ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైద్యురాలు, డా. జాన్సీరాణి, CHC, చీపురుపల్లి వారు మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని మరియు ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుందని తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో 54 మంది విద్యార్థినీ విద్యార్థులు,  బోధన మరియు బోధనేతర సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, డా.వై.ఆర్.అంబేద్కర్, డా. ఇక్బాల్ హైదర్, డా. షేక్ మస్తాన్ బి మరియు ఒ. యస్. ఏ, డా. కె. సుధారాణి మరియు జి‌జి‌హెచ్, విజయనగరం; CHC, చీపురుపల్లి సిబ్బంది వారు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి