తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు రక్త ధాతలకు ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.








