పాచిపెంట,సాలూరు,డిసెంబర్19: భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా “జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలన కొరకు కేంద్రం నుంచి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీమ్ సభ్యులు డాక్టర్ రమణ యడ్ల మరియు డాక్టర్ చీపురుపల్లి పాదాలు పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. పర్యటనలో బాగంగా జిల్లా ఎన్.సి.డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు తో కలిసి శుక్రవారం జిల్లాలో పాచిపెంట పి.హెచ్.సి,అంగన్వాడీ కేంద్రం,కూర్మరాజుపేట హెల్త్ & వెల్నెస్ కేంద్రం లను సందర్శించారు. ముందుగా వైద్యులు,సిబ్బందితో సమీక్షించి మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, అందుతున్నటువంటి మానసిక వైద్య సేవలు మరియు సిబ్బంది పనితీరును గురించి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు.  “డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా అందుతున్న మానసిక వైద్య సేవలు గురించి వివిధ అంశాలపై సమీక్షించారు. పాఠశాలల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. కేంద్రంలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు.ఆరోగ్య సూత్రాలకు సంబంధించి గోడ పత్రికలు,ఐఈసి పరిశీలించారు. మందుల లభ్యతపై తనిఖీ చేశారు.అంగన్వాడీ కేంద్రంలో సేవలపై పరిశీలించారు. కూర్మరాజుపేటలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై తెలుసుకున్నారు.మెంటల్ హెల్త్ డిజార్డర్ తో ఉన్న వారి గృహ సందర్శన చేసి చికిత్సా వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపధ్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఉందని,మానసిక ఆరోగ్య సమస్యలతో ఉన్న వారిని సకాలంలో గుర్తించి తగు చికిత్సా,పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
          ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, వైద్యాధికారి ఎం. రవిచంద్ర, సిహెచ్ఓ టి.జమ్మి, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ కృష్ణారావు, హెల్త్ వెల్నెస్ కేంద్రం వైద్య సిబ్బంది పూజా పట్నాయక్,పి. దేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి