రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భరణంగా (రీయింబర్స్‌మెంట్) సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
ఈ క్రమంలో, వైద్య ఖర్చులను భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రింది లబ్ధిదారులకు CMRF నిధులు మంజూరు చేయడం జరిగిందని
లబ్ధిదారుల వివరాలు:
1. ఈదుబిల్లి బాలకృష్ణ – తూరు మామిడి గ్రామం, మక్కువ మండలం – ₹25,614
2. చింతల సూర్యనారాయణ – పెద్దాపురం గ్రామం, సాలూరు మండలం – ₹2,17,765
3. చిత్తూరి ఈశ్వరరావు – పాచిపెంట గ్రామం – ₹1,00,275
4. జాగరపు చంద్ర – అక్యాన వీధి, సాలూరు – ₹1,75,000
5. కర్రి శాంతి – బంగారమ్మ కాలనీ, సాలూరు – ₹59,631
6. ముఖి సూర్యనారాయణ – మాతుమూరు గ్రామం – ₹1,53,930
మొత్తం: ₹7,32,215/- రూపాయలు గౌరవనీయులైన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ,
“రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న ముందస్తు చర్యలు అభినందనీయమైనవి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు వైద్య సహాయం అందించడం గొప్ప విషయమని, ప్రజలకు సహాయంగా నిలుస్తున్న నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ రాష్ట్రంలో ప్రతి పౌరుడు మెరుగైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది.” అని పేర్కొన్నారు.
*ప్రభుత్వ నిబద్ధత – ఆరోగ్య పరిరక్షణకు కట్టుబాటు*
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందుతోంది. ఎవరికైనా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంటే, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసారు





