సాలూరు పట్టణంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI), సాలూరు మరియు డిపో మేనేజర్ (DM), RTC సాలూరు వారి సమక్షంలో, సాలూరు పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి RTC బస్ డ్రైవర్లు, కన్డక్టర్లు, RTC సిబ్బంది మరియు ప్రయాణికులకు డ్రగ్స్ / గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రైవర్లు, కన్డక్టర్లు మరియు సిబ్బందికి గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యల్లో పాల్గొన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అలాగే, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సరుకు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలు మరియు వాటి నివారణలో ప్రజల సహకారం ఎంత ముఖ్యమో వివరించి అవగాహన కల్పించామని.ఈ కార్యక్రమంలో RTC సిబ్బంది మరియు ప్రయాణికులు పాల్గొని పోలీసులకు, రవాణా మరియు ఆర్టీసీ అధికారులుకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. Spread the love టపా నావిగేషన్ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళల వృద్ధి