కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి

అమ్మ వలస  కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రహదారి.అటు ఒరిస్సా నుంచి పాచిపెంట మండలాలు గ్రామాల ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రహదారి గురించి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.అనేక సందర్భాల్లో ఈ వాగులో పశువులు మేకలు కొట్టుకుపోయాయని అన్నారు.       నిత్యం అధికారులు పాచిపెంట ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తారని అయినా ఈ గిరిజన ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకొని వెంటనే వంతెన నిర్మించాలని అన్నారు.   అనేక సందర్భాల్లో రాత్రి వేల వర్షం పడితే రాకపోకలు దాదాపు రాత్రంతా అమ్మ వలస గ్రామంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని.    కారిగడ్డ ఏటికి ఇరువైపులా ప్రజలు గమ్యానికి చేరుకోలేక భయానకమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతోందని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాచిపెంట మండలం అమ్మ వలస గ్రామానికి ఆనించి ఉన్న కారి గెడ్డ వద్ద వంతెన నిర్మించే చర్యలు చేపట్టాలని ప్రజలంతా కోరారు.వరద నీటి వద్ద ప్రజల ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు     .

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి